Saturday, 18 May 2024 01:59:48 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎస్సై, కానిస్టేబుళ్ల మెయిన్స్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు..

అర్హత మార్కులు తగ్గించే ప్రసక్తే లేదు

Date : 04 January 2023 04:29 PM Views : 210

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలకు పీఎంటీ, పీఈటీ పరీక్షలు జనవరి 5తో ముగియనున్నాయి. అనంతరం మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రాథమిక రాతపరీక్షలో మాదిరి తుది పరీక్షల్లో కూడా అర్హత మార్కులను తగ్గించే అవకాశం ఉందనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. ప్రిలిమినరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకూ 60 మార్కులుగానే నిర్ణయించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం ఆదేశాల మేరకు కటాఫ్‌ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్‌ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 40 మార్కుల్ని కటాఫ్‌గా ప్రకటించారు. ఈక్రమంలో తుది రాతపరీక్షలోనూ కటాఫ్‌ మార్కులు తగ్గింపు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా స్పష్టత ఇచ్చింది. మెయిన్‌ పరీక్షలో జనరల్‌ అభ్యర్థులు 80 మార్కులు, బీసీ అభ్యర్థులు 70 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు తప్పనిసరిగా సాధించవల్సిందేనని బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మెయిన్‌ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదని ఆయన అన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో నెగ్గి, శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ అర్హత సాధించగలిగితే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని తీసేసినట్లు బోర్డు పేర్కొంది. ఆయా వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. మెయిన్‌ పరీక్షలో నిర్వహించే రెండు పేపర్లలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు మాత్రమే వస్తాయని, అందువల్లనే నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని తొలగించినట్లు వివరించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :