Saturday, 18 May 2024 11:37:57 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి: సీఎం కేసీఆర్

Date : 30 October 2023 07:29 PM Views : 66

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో చూడండి.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏవేవో చెబుతారు.. వాటిని చూసి ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి.. అటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జుక్కల్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కర్నాటక, మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి.. కర్నాటకలో రోజుకి 8-10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కర్నాటకలో 5 గంటల కరెంట్‌ మాత్రమే వస్తుంది.. కరెంట్‌ తిప్పలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణకు డీకే వచ్చి కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అంటున్నారంటూ వివరించారు. కాంగ్రెస్‌ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారు.. రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రెండు దఫాలుగా రుణమాఫీ చేసుకున్నాం.. కాంగ్రెస్‌ ఉచిత హామీలు ఇస్తుందే తప్ప, అమలు చేయదు.. అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో ఎమ్మెల్యేలు కరెంట్‌, నీళ్ల బాధలు పట్టించుకున్నారా..? తలసరి ఆదాయం ఎంత..? విద్యుత్ వినియోగం ఎంత? తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.. తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ.. కర్ణాటక ఎప్పటినుంచో ఉంది.. అయినా అక్కడి పరిస్థితులను గమనించాలంటూ పేర్కొన్నారు. తెలంగాణకి ముందు తలసరి విద్యుత్‌ 1100ల యూనిట్లు..తెలంగాణ వచ్చాక తలసరి విద్యుత్‌ 2200ల యూనిట్లు.. ఎక్కడ లేని కరెంట్‌ ఇక్కడ మాత్రమే ఉంది.. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే కరెంట్ కాటగలుస్తది.. కాంగ్రెస్‌ గెలిస్తే దళారుల రాజ్యమే వస్తుందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసే మందు ఆలోచించి ఓటు వేయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏవేవో హామీలను పట్టించుకోవద్దని.. అవన్నీ అమలుకావంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో రైతు బంధు ఆగింది.. ఎన్నికలు అయ్యాక అకౌంట్ల లో వేస్తామన్నారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని.. ఈ ప్రాంతంలోని పంటలన్నింటికి సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :