Saturday, 18 May 2024 12:36:37 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎన్నికల వేళ ఇంద్రుడికి సరికొత్త బాధ్యతలు.. కారణం అదేనా..? మరేదైనా ప్లాన్ ఉందా..?

Date : 19 October 2023 06:55 PM Views : 82

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావలన్న సంకల్పంతో ముందుకువెళుతోంది. దీనిలో భాగంగా బీజేపీ తొలితరం నేతగా పేరున్న నల్లు ఇంద్రసేనారెడ్డిని చాలా కాలం తర్వాత పార్టీ హైకమాండ్ గుర్తించింది. గవర్నర్ హోదాకు కేంద్రానికి సిఫారసు చేయడం.. ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఇంద్రసేనారెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో మలక్ పేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా పనిచేశారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇంద్రసేనారెడ్డి తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా ఎప్పుడో అవకాశాలు ఇచ్చిన బీజేపీ హైకమాండ్.. ఇంద్రసేనారెడ్డి విషయంలో కాస్తా ఆలస్యం చేసింది. ఇంద్రుడికి ఎన్నికల వేళ కొత్త బాధ్యతలు ఇవ్వడానికి వేరే కారణాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో చాలా రోజులుగా బీసీ నినాదం కొనసాగుతోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం చేసుకోవద్దని బీజేపీ భావిస్తోంది. ఎప్పటికప్పుడు రెడ్డిలకు ప్రియారిటీ తగ్గకుండా బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనాయకత్వం అవకాశాలు ఇస్తూ వస్తుంది. డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఛాన్స్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తే.. రెడ్డి వర్గం దూరం కాకుండా ఉండటానికి తాజాగా కాషాయ పార్టీ నాయకత్వం ఇంద్రుడిని గవర్నర్ కుర్చీలో కూర్చొబెట్టారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ గిరీ దక్కడం.. తెలంగాణ బీజేపీకి ఏ మేరకు లాభం జరుగుతుందో చూడాలి. ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ నాయకత్వం ఇవాళో, రేపో అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఎవరెవరికి మొదటి విడతలో సీటు లభిస్తుందనేది.. పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :