Saturday, 18 May 2024 10:36:14 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు మాట్లాడే హక్కేలేదు.. రాహుల్ పై బీఆర్ఎస్ నేతల ఫైర్..

Date : 19 October 2023 07:00 PM Views : 90

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అధికార పార్టీ బీఆర్ఎస్‌పై రాహుల్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు మాట్లాడే హక్కులేదంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ కుటుంబ పాలన కొనసాగుతుందని.. బీఆర్ఎస్.. బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనంటూ రాహుల్‌ మాట్లాడటం సిగ్గుచేటంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఎవరు..? రాహుల్‌, ప్రియాంక సమాధానం చెప్పాలి.. అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఎవరూ నమ్మరంటూ కౌంటర్ ఇచ్చారు. అసత్యాలు మాట్లాడారు.. నిరంజన్ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసత్యాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారసత్వ రాజకీయాలపై రాహుల్‌ మాట్లాడడం పెద్ద జోక్‌ అని అన్నారు. రాహుల్‌గాంధీది ఐదు తరాల వారసత్వం అంటూ నిరంజన్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌పై మంత్రి జగదీష్‌ విమర్శలు.. కాంగ్రెస్ బస్సు యాత్ర రాహుల్‌కు టైంపాస్ యాత్ర అంటూ జగదీష్‌ రెడ్డి విమర్శించారు. అవినీతికి పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రాహుల్‌కు ఉన్న ఏకైక అర్హత వారసత్వమేని.. కుంభకోణాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదంటూ జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి రాహుల్‌ అభాసుపాలయ్యారని.. కాంగ్రెస్ ఎన్ని యాత్రలు చేసినా.. బీఆర్ఎస్ జైత్రయాత్రను అడ్డుకోలేరంటూ టీవీ9తో మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. వీడియో చూడండి.. కాంగ్రెస్‌ ఓడిపోతుంది.. మంత్రి సత్యవతి రాథోడ్‌ రాహుల్‌ గాంధీ ఎక్కడి నుంచి ప్రచారం మొదలుపెడితే అక్కడ కాంగ్రెస్‌ ఓడిపోతుందని మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ తమపై విమర్శలు చేయడం కాదు..ముక్కలవుతున్న కాంగ్రెస్‌ను కాపాడుకోవాలంటూ మంత్రి సత్యవతి సూచించారు. ములుగులో కాంగ్రెస్ ఓటమి ఖాయమంటూ MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ బీ టీమ్‌ అనడం దారుణం..గండ్ర కాంగ్రెస్‌ పార్టీనే తమ పథకాలు కాపీకొట్టి ఆరు గ్యారెంటీలు అని చెబుతోందని భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. రాహుల్‌ని ఎంపీగా డిస్‌క్వాలిఫై చేసినపుడు మొదట స్పందించిందే కేసీఆర్‌ అన్నారు. అలాంటి ఇప్పుడు రాహుల్‌ తమను బీజేపీ బీ టీమ్‌ అనడం దారుణమంటూ గండ్ర ఫైర్ అయ్యారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :