Saturday, 18 May 2024 09:42:17 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ.. ఆలోచించి ఓటేయండి, లేదంటే ఐదేళ్లు నష్టపోతారు..

Date : 18 November 2023 08:01 AM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడు నాలుగు సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో.. సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. అయితే… కరీంనగర్‌, చొప్పదండి, హుజురాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో అనేక కొత్త అంశాలను టచ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌.. వందకు వందశాతం సెక్యులర్‌ పార్టీ అన్నారు కేసీఆర్‌. తెలంగాణలోని అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. మతం పేరుతో రాజకీయాలుచేసే బీజేపీకి, కర్ఫ్యూలతో కల్లోలం సృష్టించే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతుందని హెచ్చరించారు కేసీఆర్‌. రైతులు, కరెంట్‌, ధరణి… ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు గులాబీ బాస్‌. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్‌… రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు. కాగా.. హుజురాబాద్‌ సభలో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌ టార్గెట్‌గా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పాలిచ్చే ఆవును కాదని, ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని, అదే వేరేటోళ్లకు వేస్తే ఓటు మురిగిపోతుందన్నారు. హుజురాబాద్‌ ప్రజలు.. గతంలో ఓసారి తనను బాధపెట్టారని, ఈసారి ఆ తప్పు చేయొద్దన్నారు కేసీఆర్‌. వీడియో చూడండి.. కేసీఆర్‌ తనతో కన్నీళ్లు పెట్టించారని, గజ్వేల్‌లో ఓడించి బదులు తీర్చుకుంటానంటూ పోటీకి దిగారు ఈటల. గజ్వేల్‌తోపాటు సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌ బరిలోనూ నిలిచారు. అయితే, ఈటలను అతని సొంత నియోజకవర్గంలోనే ఓడించి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్‌. దాంతో, అటు గజ్వేల్‌లో, ఇటు హుజురాబాద్‌లో ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :