Saturday, 18 May 2024 11:37:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

Date : 26 October 2023 10:18 AM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది. * ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది. * ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది. * కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది. * ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. * హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది. * నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది. * ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది. * ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :