Saturday, 18 May 2024 09:22:34 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న క్యాష్‌గోల్డ్‌.. లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Date : 16 October 2023 09:51 AM Views : 77

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.తెలంగాణలో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేస్తోన్నారు. నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగదు తరలివస్తుందనే సమాచారంతో మరింత అప్రమత్తమై రాష్ట్ర బోర్డర్లలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ తనిఖీలలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్నవారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్.. ఈ నెల 9వ తేదీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడింది. దాదాపు రూ.74.95 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, గోల్డ్ పట్టుకున్నారు. ఇందులో రూ.48.32 కోట్ల నగదు ఉండగా.. రూ.4.72 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని కూడా పట్టుకున్నారు. నగదు, బంగారం తీసుకెళ్లేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను ప్రజలు తమ దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తోంది తెలంగాణ పోలీస్‌శాఖ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :