జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు, నాలుగు మసీదులపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. స్వదేశంలో నివాసం ఉంటూ మసీదులపై శ్రద్ధ వహించాలని ముస్లీం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ, గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని తెలిపారు. కాగా తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు. అదే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక తేదీ, పెళ్లి డేట్‌ను షర్మిల ప్రకటించారు. అయోధ్య తీర్పు గురించి క్లుప్తంగా.. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను తీసుకునేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పధాన భూమిక పోషించింది. ఆ తరువాత 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 జనవరి 16న ప్రారంభమై ఏడు రోజుల పాటు కన్నుల పండువగా జరగనుంది. చివరి రోజు జనవరి 22న ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించినంతరం ‘మృగశిర నక్షత్రం’లో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు
Admin