Saturday, 15 February 2025 07:29:45 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు

Date : 10 January 2024 08:48 PM Views : 411

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలోనే రాయుడు జనసేన కండువా కప్పుకుంటానే అవకాశం ఉంది. ఇటీవలే వైసీపీకి రాయుడు రాజీనామా చేశారు. ఆ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు.. జనవరి 6న ఆ పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. కాగా తాజాగా ఆ పార్టీని ఎందుకు వీడుతున్నారో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే జనసేనలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇవాళ పవన్ తో భేటీ ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ‘ఏపీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చా. కానీ, వైసీపీతో ప్రయాణంలో నా కలలు నెరవేరవని అర్థమయింది. నా ఐడియాలజీ, వైసీపీ ఐడియాలజీకి భిన్నంగా ఉంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశా. మొదట రాజకీయాలను వదిలేద్దామనుకున్నా. కానీ నా సన్నిహితుల సూచనతో పవన్ అన్నను కలిశా. ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపా. రాజకీయ పరంగా, ఏపీ డెవలప్మెంట్ పరంగా చాలా మంచి ఆలోచన ఉంది ఆయన దగ్గర. ప్రస్తుతం క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్ వెళుతున్నా. నేనెప్పుడూ ఏపీ ప్రజలకు అండగా ఉంటా' అని ట్విట్ లో చెప్పుకొచ్చారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :