Saturday, 18 May 2024 11:19:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. నేడే బ్యాంకు ఖాతాల్లో భరోసా నగదు జమ..

Date : 07 November 2023 11:47 AM Views : 73

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. పుట్టపర్తిలో వైసీపీ నిర్వ నిర్వహించే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్‌ రాక సంద్భంగా పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ రైతు భ‌రోసా ద్వారా ప్రభుత్వం రైతుల‌కు ఆర్ధిక సాయం అందిస్తుంది. ఇప్పటికే మొద‌టి విడ‌త‌లో 52.57 ల‌క్షల మంది రైతుల‌కు 7500 చొప్పున 3వేల‌942.95 కోట్లను అందించింది. రెండో విడ‌త పెట్టుబడి సాయం కోసం ఒక్కో రైతుకు 4 వేల కోట్లు విడుద‌ల చేయ‌నుంది. మొత్తం 53.53 ల‌క్షల మంది రైతుకు 2204.77 కోట్ల నిధుల‌ను సీఎం జ‌గన్ విడుద‌ల చేయ‌నున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఐదో ఏడాది రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమచేయనున్నారు. మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి. రెయిన్‌గన్‌ల పేరిట సుమారు 500 కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే. మరోవైపు టీడీపీ సైతం ఇవాళ చలో పుట్టపర్తికి పిలుపునిచ్చింది. శ్రీసత్యసాయి జిల్లాలోకి ముఖ్యమంత్రి జగన్‌కు కాలు పెట్టే అర్హత లేదంటూ విమర్శించారు కాంగ్రెస్‌ సీనియర్ నేతలు. తాగునీటి కోసం కేటాయించిన నీటిని చిత్తూరు జిల్లాకు తరలిస్తుంటే జిల్లా ఎమ్మెల్యేలు చూస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులకు చెల్లిస్తామన్న నష్టపరిహారం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని తప్పుబట్టారు. దీనికి నిరసనగా చలో పుట్టపర్తికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపు.. అలర్ట్‌ అయిన పోలీసులు.. అయితే, టీడీపీ చలో పుట్టపర్తికి అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మడకశిరలో నియోజకవర్గంలో కరువు ప్రాంతాలను పరిశీలిస్తున్న టీడీపీ మాజీ మంత్రులను అడ్డుకున్నారు పోలీసులు. పుట్టపర్తి వెళ్లకుండా మడకశిర స్టేషన్‌కు తరలించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :