జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీశైలం, జగ్గయ్యపేట, పాలకొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని వివరించడమే లక్ష్యంగా సాగుతున్న యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది వైసీపీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు.. వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం.. పాలకొండ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. పేద, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతతోపాటు రాజ్యాంగ పదవుల్లోనూ అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా.. బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్‌తోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుకు పెత్తందారులపై ప్రేమ ఉంటే.. జగన్‌కు పేదలంటే ప్రేమ అని గుర్తు చేశారు మంత్రి విడదల రజిని. . నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరిగింది. దానిలో భాగంగా.. ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కుట్ర చేశారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Admin