Saturday, 18 May 2024 01:59:47 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గేరు మార్చి పక్కా ఎన్నికల మూడ్‌లోకి వైసీపీ.. బస్సు యాత్రలతో జనంలోకి..

Date : 27 October 2023 10:54 AM Views : 66

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : బస్సుయాత్రలతో గేరు మార్చి పక్కా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది వైసీపీ. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన బస్సు యాత్రల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు నేతలు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సాగింది తొలిరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర. ఏపీలో 65 రోజులకు పైగా సాగే వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో దూసుకెళ్లాయి వైసీపీ బస్సులు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మైనారిటీ వర్గాలతో మమేకం అవుతూ సాగారు నేతలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇచ్చాపురం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి, పూజా కార్యక్రమాలు నిర్వహించి బస్సు యాత్రను ప్రారంభించారు. సాయంత్రం 10 వేల మందితో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు నేతలు. అటు.. మధ్యాంధ్ర ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది సామాజిక సాధికార బస్సు యాత్ర. కొలకలూరుకు ఉదయాన్నే చేరుకున్న నేతలు.. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. దక్షిణాంధ్రలో అనంతపురం జిల్లా శింగనమల నుంచి వైసీపీ బస్సు యాత్ర మొదలైంది. ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మంత్రులు ఉషశ్రీ చరణ్‌, జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్.. స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగసభ జరిగింది. బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా సందేశమిచ్చారు సీఎం జగన్. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అన్ని సామాజికవర్గాలకూ ప్రగతిని ఒక హక్కుగా అందించామంటూ ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం గజపతి నగరం, నరసాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో రెండోరోజు బస్సు యాత్రలు జరుగుతాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :