Saturday, 18 May 2024 01:59:57 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధుల కేటాయించాలని టీటీడీ ప్రతిపాదన.. నో చెప్పిన ఏపీ సర్కార్..

Date : 21 October 2023 08:49 AM Views : 71

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధుల కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే విషయంపై గత కొంతకాలంగా బీజేపీ నేతలు, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన నిధులు ఆలయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది. దీని వెనుక ఉన్న రీజన్ ఏమిటంటే.. తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించాలన్న ఆలోచనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయించగా వివాదం రేగింది. ఈ క్రమంలో.. టీటీడీ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి ఒక్క శాతం శ్రీవారి ఆలయ నిధులను వెచ్చించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది సరికాదంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం నో చెప్పేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హిందు ధర్మంలో భక్తులు దేవుడికి తమ సంపాదనను భక్తితో హుండీలో మొక్కులుగా సమర్పణ చేసే కానుకల విషయంలో గట్టి విశ్వాసాలు ఉంటాయని భక్తులు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ, వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరు. చివరికి భక్తులు ముడుపు కట్టిన సొమ్ములు కూడా దేవునికి తప్ప మరే కార్యక్రమం కోసం వాడరు. Sharannavratri 2023: బ్రిటీష్ వారు ఫిరంగితో దాడి చేసినా ధ్వంసం కాని గ్రామం.. దొంగలు ఆశ్రయం ఇచ్చిన ఆలయ విశిష్టత ఏమిటంటే దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులకు మాత్రమే వినియోగిస్తారు. కానీ.. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక ఆలయ ఆదాయంలో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ప్రతిపక్షాలతోపాటు భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడం, విమర్శల వెల్లువతో ఏపీ సర్కార్ మనసు మార్చుకుంది. టీటీడీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. ఈవోకు సమాచారం పంపింది ఏపీ దేవదాయశాఖ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :