Saturday, 18 May 2024 10:36:24 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పెన్ను కెమెరా, మావోయిస్టుల లేఖ, గంజాయి ప్యాకెట్లు.. చంద్రబాబు లేఖ ప్రకంపనలు.. డీఐజీ ఏమన్నారంటే..?

Date : 28 October 2023 09:09 AM Views : 65

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి.. రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈనెల 25న చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు జడ్జికి పంపారు. పెన్ను కెమెరాతో ఒక రిమాండ్‌ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడని లేఖలో పేర్కొన్నారు. తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని.. తనను హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలో తెలిపారు చంద్రబాబు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని.. దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. రాజమండ్రి జైలుపై ఈ మధ్య తన కుంటుం కలిసేందుకు వచ్చిన సమయంలో ఒక డ్రోన్‌ తిరిగిందని తెలిపిన బాబు.. జైలు, దాని చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయాలని లేఖలో కోరారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారని చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు లేఖలో రాసిన ప్రతి ఇష్యూపై జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ వివరణ ఇచ్చారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు.. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం.. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకువెళ్లలేదని డీఐజీ రవికిరణ్ వివరించారు. మరోవైపు చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్‌ చేయాలంటూ వస్తున్న వార్తలపై కూడా వివరణ ఇచ్చారు డీఐజీ రవికిరణ్. చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు అర్జెంట్‌గా కంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. లేఖలో రాసిన సమాచారాన్ని మార్చడం కరెక్ట్ కాదన్నారు. జైల్లో చంద్రబాబు భద్రతపై పూర్తి క్లారిటీతో ఉన్నామని డీఐజీ రవికిరణ్ స్పష్టంచేశారు. ఇలా మొత్తానికి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. లేఖలో చాలా సీరియస్‌ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్‌గా తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :