Saturday, 18 May 2024 11:37:52 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తుది వాదనల అనంతరం తీర్పు.. సుప్రీంలో ఇవాళ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ..

Date : 17 October 2023 11:34 AM Views : 74

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబుకు ఇవాళ బిగ్‌ డేగా కనిపిస్తోంది. క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌ ఇచ్చే తీర్పు బెంచ్‌ మార్క్‌ గా ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. అలాగే హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్.. ఏసీబీ కోర్ట్‌లో చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌పై విచారణ.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా.. లేదా.. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. అయితే మరోసారి అవకాశం కల్పించాలంటూ సీఐడీ తరపు లాయర్ రోహత్గీ కోరారు. దీంతో ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ఆయన వాదనలు విన్న తర్వాత కోర్ట్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇవాళ తేలనుంది. చంద్రబాబు రెగ్యులర్‌ హెల్త్‌ రిపోర్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. దీనిపై ఇవాళ వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుకానున్నారు చంద్రబాబు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ACB కోర్టు తెలుసుకున్న తర్వాత ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక స్కిల్‌ కేసులో ఇవాళ కూడా విచారణకు హాజరుకానున్నారు కిలారు రాజేష్. నిన్ని 6గంటలకుపైగా సీఐడీ ప్రశ్నించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నారు రాజేష్. సీఐడీ అధికారులు తనను 25 ప్రశ్నలు అడిగారని చెప్పారాయన. ఈ స్కామ్‌లో నిధుల మళ్లింపునకు సంబంధించిన కొన్ని అంశాలపై CID అధికారులు ఆరాతీశారు. మరోవైపు ఇన్నర్‌రింగు రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 18కి ఏపీ హైకోర్ట్ వాయిదా వేసింది. IRR అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో చంద్రబాబును ఏ1గా చేర్చారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్ట్‌ నవంబర్‌ 1కి వాయిదా వేసింది. సీఐడీ అధికారులు ఇచ్చిన ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు రీ ఓపెన్‌పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరుపక్షాలకు సూచించింది న్యాయస్థానం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :