Saturday, 18 May 2024 11:19:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పెరుగుతున్న జ‌నాభాకు ప్ర‌స్తుత‌ వ్య‌వ‌సాయం స‌రిపోతుందా..? ఆగ్రోఎకో 2050 రిపోర్ట్ నివేధికలో షాకింగ్‌ విషయాలు..

Date : 17 October 2023 06:36 PM Views : 71

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయవాడ,అక్టోబర్17; ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌ధాన జీవ‌నాధారం వ్య‌వ‌సాయం…రాష్ట్రంలో ఎక్కువ‌మంది వ్యవ‌సాయంపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు…ఇలాంటి వ్య‌వ‌సాయ రంగాన్ని రైతుల‌కు లాభ‌సాటిగా మార్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది..రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో పాటు విత్త‌నాలు,ఎరువులు అన్నీ కూడా ప్ర‌భుత్వ‌మే నేరుగా రైతుల‌కు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటుచేసిన రైతు భ‌రోసా కేంద్రాలు రైతుల‌కు వ‌రంగా మారాయి…ఈ క్రాపింగ్ నుంచి పండించిన పంటలు అమ్ముకునే వ‌ర‌కూ ఆర్బీకేల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్ర‌భుత్వం..రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఖ‌చ్చితంగా వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ప‌దేప‌దే అధికారుల‌ను ఆదేశిస్తున్నారు…ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా ఉండే స‌హ‌జ‌సిద్ద వ్య‌వ‌సాయానికి కూడా అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంది ప్ర‌భుత్వం…రైతుల‌కు త‌క్కువ పెట్టుబ‌డితో ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండేలా నేచుర‌ల్ ఫార్మింగ్ ను ప్రోత్స‌హిస్తుంది…ఇక రాష్ట్ర సుస్థిర అభవృద్దికి రాబోయే రోజుల్లో మ‌రింత వృద్ది రేటు పెరిగేందుకు ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాజాగా వెల్ల‌డించింది..దీనికి సంబంధించి రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంపై రైతు సాధికార స‌మితి ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో క‌లిసి ఓ నివేదిక‌ను సిద్దం చేసింది.ఆగ్రో ఎకో 2050 నివేదిక ద్వారా రాష్ట్రంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం- ప్ర‌యోజ‌నాలను వివ‌రించింది. ఆగ్రో ఎకో 2050 నివేదిక‌లో కీల‌క అంశాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థిర‌మైన వ్య‌వ‌సాయ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం కోసం స‌హ‌జ వ్య‌వ‌సాయాన్ని ఎక్కువ‌గా పాటించ‌డం ప్ర‌ధాన మార్గం అని ఆగ్రో ఎకో 2050 నివేదిక పేర్కొంది.స‌హ‌జ,ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా స్ధిర‌మైన వ్య‌వ‌సాయ వ్య‌వ‌స్థ‌నున నిర్మించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుసాధికార సంస్థ , ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, మరియు యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ క‌లిసి ఈ నివేదిక‌ను రూపొందించాయి.స‌హ‌జ వ్య‌వ‌సాయం,ఆగ్రో ఎకాల‌జీ,పారిశ్రామిక వ్య‌వ‌సాయం పై అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే దానిపై ఈ నివేదిక‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు..ముఖ్యంగా జ‌నాభా పెరుగుద‌ల‌,వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అవ‌స‌రం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 2050 వ‌ర‌కూ అవ‌స‌ర‌మైన వాటిపై నివేదిక ఇచ్చింది…వ్య‌వ‌సాయం ద్వారా రాష్ట్రఆనికి స్ధిర‌మైన భ‌విష్య‌త్తు మార్గాన్ని ఇచ్చేలా ఆగ్రోఎకో 2050లో పేర్కొన్నారు.2020 నాటికి ఐదు కోట్లపైబ‌డిన జనాభా కలిగిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, 2050లో 60 మిలియన్ల జనాభాను చేరుకుంటుందని అంచ‌నా వేసారు…అయితే పెరుగుతున్న జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా ఆహారం,ఉపాధి మరియు ఆర్థిక వృద్ధికి పెరుగుతున్నడిమాండ్‌లను తీర్చడానికి ప్రస్తుతం ఉన్న‌ వ్యవసాయ వ్యవస్థలను పునఃపరిశీలించవలసి ఉంటుందని నివేదిక‌లో పేర్కొన్నారు..అటు పారిశ్రామిక వ్యవసాయం విషయంలో,సింథటిక్ రసాయనాలపై ఆధారపడిన సాంప్రదాయిక విధానం కూడా సగానికి తగ్గించబడింది,

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :