Saturday, 18 May 2024 11:19:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Date : 11 October 2023 11:45 AM Views : 73

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న సందర్భాల్లో వయోపరిమితి పెంచుకుంటూ వస్తోంది. గరిష్ట వయసు దాటిపోయిన నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు వయోపరిమితిని పెంచుతూ జీవో లు జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్,నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితి ఉంది. తాజాగా యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ని ప్రస్తుతం ఉన్న దానికి రెండేళ్లు అదనంగా పెంచింది.ఇక నాన్ యూనిఫామ్ అభ్యర్థుల కి జనరల్ కెటగిరీకి ఉన్న 34 ఏళ్ల గరిష్ట వయసును 42 ఏళ్లకు పెంచింది.దీంతో పాటు రిజర్వ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఉండే అదనపు వయోపరిమితి కూడా వర్తిస్తుంది… వచ్చే యేడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకూ నిర్వహించే అన్ని ఉద్యోగాల భర్తీకి ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.త్వరలో గ్రూపు 1,గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :