జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఆయన సీఎంగా పనిచేశారు. శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కొద్దికాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు.
Admin