Saturday, 18 May 2024 10:51:48 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గ్రహణ కాలంలో అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. అదే ఆ టెంపుల్ స్పెషల్.. ఎక్కడంటే..

Date : 28 October 2023 09:02 AM Views : 67

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : దక్షిణకాశీగా రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం లో గ్రహణ సమయం ఎంతో ముఖ్యమైంది. అందుకే గ్రహణ సమయంలో అన్ని హిందూ ఆలయాలు మూసివేస్తే శ్రీకాళహస్తిలో క్షేత్రంలో గ్రహణ సమయం లో ముక్కంటి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఎలాంటి గ్రహణ ప్రభావం ఉండని రాహుకేతు క్షేత్రంలో ఆ సమయంలో మూడు కాలాల అభిషేకాలు నిర్వహించడం ప్రత్యేకత. ఈనెల 29న పాక్షిక చంద్రగ్రహణం తో తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటల పాటు టిటిడి మూసివేయనుంది. 28 రాత్రి 7.05 గంటల నుండి 29 ఉదయం 3.15 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనుంది. 29న వేకువ జామున 1.05 నుండి 2.22 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉండటంతో 28 సాయంత్రం 6 గంటల నుండి 29 ఉదయం 9 గంటల వరకు అన్న ప్రసాద కేంద్రం మూసివేయ నుండగా 28న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. చంద్రగ్రహణంతో టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు విజ్ఞాలకు అధిపతి అయిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం కూడా మూసివేయనున్నారు అయితే ఇందుకు భిన్నంగా గ్రహణ దోషం లేని శ్రీకాళహస్తి ఆలయంలో రేపు అర్ధరాత్రి ఒంటిగంటకు చంద్రగ్రహణ స్పర్శ కాలం, 1:45 గంటలకు మధ్యకాలం, 2:30 గంటలకు చంద్రగ్రహణం మోక్షకాలం లో ప్రత్యేక అభిషేకాలు అర్చకులు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణ కాలంలో యధావిధిగా రాహుకేతు క్షేత్రం లో పూజలు, భక్తులకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి. గ్రహణం విడిచాక సంప్రోక్షణతో శుద్ధిచేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక శాంతి అభిషేకం కూడా నిర్వహించనున్న అర్చకులు భక్తులకు శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసన్నాంబికల దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడిపై 5 తలల సర్పం, అమ్మవారి నడుమున సర్పంతల బంగారు ఆభరణాల రూపంలో ప్రత్యేక అలంకరణగా ఉన్నందున ఆలయానికి గ్రహణ దోషం ఉండదని అర్చకులు చెబుతారు. నవగ్రహ కవచం కలిగిన మహా విష్ణువు వాయు లింగం అవతారంలో శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నందున సూర్య చంద్ర గ్రహణాలు, రాహు కేతు దోషాలు స్వామివారికి ఉండవని ప్రాచుర్యంలో ఉంది. దీంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలసర్ప దోషం, మహా కాలసర్పదోషాలకు పూజలు చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకాళహస్తి క్షేత్రంలో సకల దేవతలకు నిత్యం అభిషేకాలు, పూజలు, ఆరాధనలు 7 కాలాలుగా స్వామి అమ్మవార్లకు జరుగుతుండగా స్వామి వారి కవచంలో అగ్నిపట్టాకురితో పాటు 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు నిక్షిప్తం గా కవచంతో దర్శనం ఇవ్వడం వల్ల గ్రహణ సమయంలో శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. రాహు కేతువులు కూడా ఎలాంటి ప్రభావం చూపరని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అందుకే ఈ క్షేత్రం గ్రహణ సమయాల్లోనూ నిత్య కైంకర్యాలతో దక్షణ కాశీ గా విరాజుల్లుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :