Saturday, 18 May 2024 01:59:51 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పోలీస్‌ శునకానికి ఘనంగా వీడ్కోలు.. కంటతడి పెట్టుకున్న పోలీసులు..

Date : 30 October 2023 09:07 AM Views : 62

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చిత్తూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి 9 ఏళ్లపాటు సేవలు అందించిన పోలీస్‌ శునకం జెస్సీ మృతి చెందింది. జిల్లా ఎస్సీ రిషాంత్‌ రెడ్డి ఆదేశాలతో జెస్సీకి ఘనంగా దహన క్రియలు నిర్వహించారు. దహన క్రియలను ఘనంగా నిర్వహించింది చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం. చిత్తూరులోని డాగ్‌ స్క్వాడ్‌ విభాగంలో జెస్సీ సేవలు అందించింది. సుమారు 9 ఏళ్లపాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సేవలందించిన జెస్సీ ఆదివారం తుది శ్వాస విడించింది. జెస్సీ మరణంతో పోలీసులు కంటతడి పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి.నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో డాగ్‌ స్క్వాడ్‌ యూనిట్‌లో దహన క్రియలను నిర్వహించారు. జెస్సీకి శాలువా కప్పి పూల మాలలు వేశారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు జెస్సీ చేసిన సేవలను కొనియాడారు. పోలీస్‌ విధుల్లో జెస్సీ చేసిన సేవలను కొనియాడారు. ఎన్నో కేసుల దర్యాప్తుల్లో జెస్సీ చేసి సేవలను పోలీసులు ఈ సందర్భంగా గుర్త చేసుకున్నారు. జెస్సీ 2014 మార్చి 22న జన్మించింది. బ్రెడార్‌ జాతికి చెందిన ఈ స్నఫ్ఫెర్‌ డాగ్‌ చిత్తూరు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు 2014 మే 25వ తేదీ నుంచి సేవలందిస్తూ వచ్చింది. సుమారు 9 ఏళ్లపాటు ఈ శునకం సేవలు అందించింది. వీఐపీలు, వీవీఐపీల పాల్గొనే కార్యక్రమాల్లో సెక్యూరిటీ సేవలు అందంచింది. Police Dog ఎన్నో కీలక కేసుల్లో చురుగ్గా సేవలందించి దోషులను పట్టించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక కాణిపాకం, తిరుమల శ్రీవారి బ్రహ్మొత్సవాలు విధుల్లో సంఘవిద్రోహ చర్యల పై ఉక్కు పాదం మోపేలా జెస్సీ సేవలు అందించింది. పలు కీలకమైన కేసుల్లో దర్యాప్తునకు సహకరించింది. ఎన్నికల విధుల్లోనూ చురుగ్గా పాల్గొంది. ఎంతగానో సేవలందించిన జెస్సీ పోలీసు డిపార్టుమెంటులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకోగా జెస్సీ హాండ్లర్‌గా హెడ్ కానిస్టేబుల్ వి. శ్రీహరి జెస్సీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :