Saturday, 18 May 2024 12:36:39 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సామాన్యులపై మరో పిడుగు.. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు..

Date : 27 October 2023 11:01 AM Views : 63

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు గుబేల్ మంటున్నాయి. మొన్నటి మొన్న టమాట ధరలు ప్రజలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. టమాట పేరు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కిలో టమాట ధర ఏకంగా రూ. 200 వరకు చేరింది. దీంతో టమాట కొనడమే ఆపేశారు. అయితే ఆ తర్వాత ధరలు మళ్లీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి కూడా ఇదే దారిలో వెళుతోంది. సాధారణంగా ఉల్లి లేనిదే జిహ్వ తృప్తి చెందంటారు.. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా ఉల్లి పాయల ధరలు కిలో రూ.60 నుంచి రూ.86 వరకు విక్రయిస్తున్నారు. ఇక సూపర్ మార్కెట్లు, ఇతర మాల్స్ లో అయితే కిలో నికరంగా రూ.90 వరకు పలుకుతుంది, రైతు బజారులు సైతం ప్రాంతాల వారిగా ఉల్లి ధరలు ఉంటున్నాయి. వీటిలో కిలో ఉల్లి ధర రూ38 నుంచి రూ.46 వరకు పలుకుతోంది. వినియోగదారులకు ఇక్కడ కిలో నుంచి రెండు కిలోల వరకు పరిమితంగా ఇస్తున్నారు. కార్పోరేట్ వాణిజ్యరంగంలో వ్యాపార పరంగా డిమాండ్ ఉన్న చిన్న ఉల్లి ధరలు మధ్యతరగతి కుటుంబాల జీవనానికి తగినట్లుగానే కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అక్టోబరు, నవంబరు నెలల నుంచి ఉల్లిధరలు పూర్తిగా వినియోగదారునికి అనుకూల రీతిలో ఉంటాయి. అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా లోడ్ దిగుబడి కాకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఆంధ్రాకు ప్రధాన ఉల్లి ఉత్పత్తిదారుగా ఉన్న కర్నూలులో వాతావరణ అననుకూలత, దసరా సెలవుల ప్రభావం ఉందంటున్నారు. ఇక్కడనుంచి ఉల్లి ఎగుమతులు సరిగ్గా అవసర సమయంలో పండుగ సీజన్ లో ఆగడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మరో వారంలో ఉల్లిధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అభిప్రా యపడుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :