Saturday, 18 May 2024 01:11:25 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ట్రిపుల్‌ ఐటీలో మరో మారు ఫుడ్‌ పాయిజన్‌..

విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Date : 05 November 2022 02:21 PM Views : 309

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / శ్రీకాకుళం జిల్లా : ట్రిపుల్ ఐటీ డిస్పెన్సరీలో విద్యార్థులకు అరకొర వైద్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు చికిత్స కోసం బయట నుంచి వైద్య బృందాన్ని రప్పించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు మెరుగైన చికిత్స అవసరం కావడంతో..తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కాలేజీ హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు.. ఆహారం తినాలంటే భయపడుతున్నారు.. నీళ్లు తాగాలంటే టెన్షన్ పడుతున్నారు.. ఏ క్షణం అనారోగ్యానికి గురవుతారో అని ఆందోళనపడుతున్నారు.. ఎప్పుడు ఎవరు సడెన్‌గా పడిపోతారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 336 మంది.. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో 25 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో శుక్రవారం ఉదయం నుంచి కొందరు విద్యార్థులు కడుపునొప్పి అంటూ వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఎచ్చెర్ల IIITలోనిన్నటి నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. 24 గంటల్లో మొత్తం 336 మంది విద్యార్థులు ట్రీట్‌మెంట్‌ పొందినట్లు డిస్పెన్సరీ రికార్డులు చెబుతున్నాయి.శుక్రవారం సాయంత్రం వ౦ద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి కండీషన్‌ సీరియస్‌గా ఉండడంతో అర్ధరాత్రి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించి వెంటనే తిరిగి క్యా౦పస్ కి తీసుకువచ్చారు. తాగునీరు కలుషితం కావడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియాను లోపలకు అనుమతించటంలేదు. అసలేం జరిగిందనే విషయం చెప్పేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే, ఎట్టకేలకు స్పందించిన అధికార యంత్రాంగం ట్రిపుల్ ఐటీ డిస్పెన్సరీలో విద్యార్థులకు అరకొర వైద్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు చికిత్స కోసం బయట నుంచి వైద్య బృందాన్ని రప్పించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులకు మెరుగైన చికిత్స అవసరం కావడంతో.. శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు.ఇటు, సంగారెడ్డి నారాయణఖేడ్‌ కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది, 25 మంది బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్ధతలకు గురయ్యారు. అయితే వాళ్లు ఏం తిన్నారు..వాళ్లు తిన్న ఫుడ్‌ పాయిజన్‌ అయిందా? లేక వాటర్‌ పొల్యూట్‌ అయిందా? అసలేం జరిగింది అన్నది దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :