Saturday, 18 May 2024 10:08:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌..రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలన్న ఏపీ హైకోర్టు

Date : 13 October 2023 12:42 PM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అంగళ్లు కేసులో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. అమరావతి, అక్టోబర్ 13: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలన్న ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంగళ్లూ కేసులో గురువారం వాదనలు ముగిసాయి. ఇవాళ మొదటి కేసుగానే దీనిపై తీర్పు వెలువడింది. గతంలో చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లే సమయంలో అంగళ్లు దగ్గర ఘర్షణలో ఉద్రిక్తత తలెత్తింది. చంద్రబాబు ముందుగా చెప్పిన రూట్‌లో కాకుండా మరో దారిలో వెళ్లడమే ఈ గొడవలకు కారణమని కేసులు నమోదు చేశారు. రాళ్లదాడికి కారణాల విషయంపైనా కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో A-1గా ఉన్నారు చంద్రబాబు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆరోజు ఘర్షణ జరిగిందని పోలీసులు ఆరోపించారు. ఆయనపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో దాదాపు 179 మంది వరకూ ఉన్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ ఇప్పటికే బెయిల్‌ దొరికింది. ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఊరట లభించింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తుతో బెయిల్‌ ఇచ్చింది కోర్టు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :