Saturday, 27 July 2024 02:04:39 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

బోటు నుంచి వచ్చిన ఆ ఇద్దరు ఎవరు..? విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో కీలక ఆధారాలు స్వాధీనం.. వీడియో

Date : 25 November 2023 08:22 AM Views : 150

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఇదొక పెను ప్రమాదంగా మిగిలిపోయింది. కాగా.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సీసీ ఫుటేజ్‌ సేకరించారు పోలీసులు. ఆ ఫుటేజ్‌లో ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు ప్రమాదం జరిగిన బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చారు. 19తేదీ రాత్రి 10:48కి బోటు నుంచి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు బయటికి రాగా.. అదే రాత్రి 10.50కి బోటులో మంటలు చేలరేగాయి. దీంతో ప్రమాద ఘటనతో ఆ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉంటుందనే కోణాంలో విచారిస్తున్నారు పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులనే గుర్తించే పనిలో పడ్డారు సీసీ ఫుటేజ్‌తో కేసు మొత్తం మరో మలుపు తిరిగింది. వీడియో చూడండి.. అంతకుముందు యూట్యూబర్ నాని.. పలువురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకోని ప్రశ్నించారు. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు మరికొన్ని కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :