Saturday, 18 May 2024 10:51:50 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 7కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం కీలక ఆదేశాలు

Date : 30 October 2023 08:59 AM Views : 105

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి తక్షణ సహాయక చర్యలు చేపట్టి వీలైనంత ఎక్కువ అంబులెన్స్‌లను పంపించాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో మంత్రి బోత్స సత్యనారాయణ సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157తో ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. అలాగే రైల్వే ఫోన్ నంబర్ 8978080006కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా ఓవర్‌ హెడ్‌ కేబుల్‌ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్‌ రైలును పలాస ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్‌ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని రైల్వే అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు రైలు ప్రమాదం నేపథ్యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్‌నుల కేటాయించారు అధికారులు. 08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :