Saturday, 18 May 2024 10:08:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గ్రామ సింహాల దెబ్బకు ఆ పట్టణ వాసులు విలవిల.. కాపాడండి మహాప్రభో అంటూ అధికారులకు విన్నపాలు

Date : 11 November 2023 04:09 PM Views : 78

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : గ్రామ సింహాల దెబ్బకు ఆ పట్టణ వాసులు విలవిలలాడుతున్నారు. కుక్కల్ని చూసినా , కనిపించినా అమ్మో .. అంటూ పరుగులు తీస్తున్నారు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పిల్లల భయాన్ని వర్ణించలేమని అంటున్నారు కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణ వాసులు.పట్టణ పరిధిలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. రాజావీధిలో ఓ మహిళను కరుస్తుండగా కుక్క నుంచి విడిపించేందుకు వచ్చిన వారిపైనా దాడి చేసింది. రాజా వీధి, SPGపాలేం,పెద్ద బజారు, నగర పంచాయతీ కార్యాలయం ప్రాంతాల్లో దాదాపు 40 మందిపై శునకం దాడి చేసింది. 22 మందికి తీవ్రగాయాలయ్యాయని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పురపాలక సిబ్బంది కుక్కను పట్టుకున్నారని కమిషనర్ శ్రీనివాస రావు వెల్లడించారు. పట్టణంలో కుక్కలను పట్టుకోమని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఆత్మకు పట్టణ పరిధిలో కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బైక్ లపై వెళ్లే వారిని మాత్రమే కాదు కారులో వెళ్లిన వారిపై కూడా వెంట పడుతున్నాయి. పలుమార్లు కుక్కలు దాడి చేస్తుండడంతో ప్రజలు గాయపడుతున్నారని.. అధికారులు విస్మరిస్తున్నారని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరులో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. అధికారులు కట్టడి చర్యలు చేపట్టకపోవడంతో వీటి సంతతి రోజురోజుకు అధికమవుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రధాన రహదారు లతో పాటు కాలనీల్లోని వీధుల్లో పదుల సంఖ్యలో గుమికూడి అటుగా రాకపోకలు సాగించే వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇంటి బయట ఆడుకునే చిన్నారులను గాయపరుస్తున్నాయి. వీధికుక్కల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారని కౌన్సిల్ సమావేశంలో కౌన్సి లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాసరే చర్యలు కరవయ్యాయి. పట్టణంలోని గరీబ్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి, కొత్తపేట, కిషన్ సింగ్ వీధి, కప్పలకుంట, వడ్లపేట. ఎస్పీజీ పాలెం, ఏబీఎంపాలెం, రహ్మత్ నగర్, ఇందిరానగర్ లో కుక్కల సంచారం అధికంగా ఉంది. మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కుక్కల గుంపులుగా సంచరిస్తున్నాయి Viral News: ఆఫీసుకి రావాల్సిందే అన్నారు.. రూ. 1.69 కోట్ల ప్యాకేజ్ జాబ్‌కు గుడ్ బై ఇస్లాంపేట, నంద్యాల టర్నింగ్ ప్రాంతాల్లో మాంసం దుకాణాలు ఉండటంతో ఈ ప్రాంతంలో ఒక్కో గుంపులో 20కి పైగా శునకాలు సంచరిస్తున్నాయి. పాఠశాలకు, దుకాణాలకు వెళ్లే పిల్లలను వెంబడిస్తున్నాయి. ఇళ్ల ముందు ఆడుకుంటున్న వారిపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. వడ్లపేట, కిషన్ సింగ వీధి, రహ్మత్ నగర్ , కొత్తపేట, ఖల్లా వీధుల్లో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. నియంత్రణలో విఫలం వీధికుక్కల నియంత్రణలో పాలక వర్గం, అధికారులు విఫలమవుతున్నారు. వీధుల్లో సంచరించే కుక్కలను పట్టించి నంద్యాలకు తరలించి కు.ని శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంది. ఇలా చేయడం వలన కుక్కల సంతతి పెరగకుండా చూడొచ్చు. గతంలో రూ. 3 లక్షలు వెచ్చించి శునకాలను పట్టుకుని నంద్యాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇంత వరకు కుక్కలను పట్టినవారికి చెల్లించలేదు. దీంతో వారు తాము మళ్లీ కుక్కలను పట్టమని చెబుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను కట్టడి చేయాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :