జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోతైన విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారణను అనుమతిస్తూ.. ప్రతివాదులుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహ 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో ట్విస్ట్. ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోతైన విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారణను అనుమతిస్తూ.. ప్రతివాదులుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహ 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సెప్టెంబర్ నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కీలకమైన ఈ కేసులో అనేక సంక్లిష్టమైన అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నాయని కోర్టుకు వివరించారు. తీవ్ర వరిణామాలతో ముడిపడిన ఆర్థిక నేరం ఇదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేతపై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోందని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నవిషయాన్ని తన పిటిషన్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఈడీ డైరెక్టర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, APCID, గంటా సుబ్బారావు సహ 44 మందిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఈడీ, ఐటీ, సీఐడీ విచారణ చేస్తున్న హైప్రొఫైల్ కేసు ఇదని ఉండవల్లి తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. రిట్ నెంబర్ 38371/2023గా నమోదు చేసిన రిజిస్ట్రార్.మరో వైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు స్పష్టం చేశారు. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ కేసుల విచారణ కూడా సీబీఐకి అప్పగించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్న విషయాన్ని కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న 44 మందికి నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Admin