Saturday, 18 May 2024 09:42:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ధరల దోపిడీపై టీటీడీ కొరడా.. ఏపీ టూరిజంకు హోటల్స్‌ను అప్పగించేందుకు నిర్ణయం..

Date : 10 October 2023 09:38 AM Views : 68

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ దందాకు చెక్ పెట్టింది టీటీడీ. తిరుమలలో భక్తుల ఆకలి, ఆహార అవసరాలు ఆసరాగా ప్రైవేట్ హోటల్లో కొనసాగుతున్న ధరల దోపిడీపై యాక్షన్ తీసుకుంది. ఇంకా చెప్పాలంటే తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ధరల దోపిడీపై టిటిడి కొరడా జులిపిస్తోంది. భక్తుల ఫిర్యాదుతో తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారం అందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా హోటల్స్‌ బాధ్యతను ఏపీ టూరిజంకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు హోటల్స్ నిర్వహణను ఏపీ టూరిజంకు కట్టబెట్టింది టీటీడీ . ఈక్రమంలో మరిన్ని హోటల్స్ లైసెన్సులను రద్దు చేయాలని భావిస్తుంది. నాణ్యమైన ఆహార పదార్థాలను తక్కువ ధరలకు అందుబాటులో తీసుకొచ్చేలా చొరవ చూపుతోంది. డయల్ యువర్ ఈఓలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఎట్టికేలకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది టీటీడీ. నెలకు దాదాపు రూ. 50 లక్షల దాకా రెంట్ చెల్లిస్తున్న ఒక్కో రెస్టారెంట్ ఇష్టమొచ్చినట్లు ధరలు నిర్ణయించి దోపిడీ కొనసాగిస్తుండటంతో భక్తులు నిలువ దోపిడీకి గురి అవుతున్నారు. వందకు పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లోనూ ఇదే రీతిలో ధరల దగా కొనసాగుతుండడం గమనించి టీటీడీ యాక్షన్‌ స్టార్ట్ చేసింది. ఏపీ టీడీసీకి తక్కువ టెండర్ ధర నిర్ణయించి నాణ్యమైన ఆహారం భక్తులకు అందించే చర్యలు చేపట్టింది. గతంలో తిరుమలకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు ఎలాంటి ఖర్చులేకుండా టీటీడీ అందించాలని ప్రతిపాదనలు పెట్టినటప్పటికి అవి అమలు సాధ్యం కాలేదు. టిఫిన్‌ కోసం హోటల్స్ కు వెళ్తే సుమారు 400 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో.. ధరల దోపిడి కట్టడి చేసేందుకు త్వరలోనే భక్తులకు సౌకర్యవంతమైన ఆహారం తక్కువ ధరలకు అందించేందుకు టీటీడీ పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటుంది. ధరల టోడిపీడికి చెక్ పెడుతూ ఏపీ టూరిజంకు హోటల్స్‌ను అప్పజెప్పేందుకు నిర్ణయం తీసుకుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :