Saturday, 18 May 2024 11:57:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఇంటి వద్ద స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పిన బాలుడు.. తీరా చూస్తే.. రైలు పట్టాలపై అడ్డంగా..!

Date : 15 October 2023 08:29 AM Views : 68

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలమో…లేదా వారి జాతక ఫలమో తెలియదు గానీ కొందరు చావు అంచువరకు వెళ్లి బయట పడుతూ ఉంటారు. చివరి క్షణంలో ఏదో రూపంలో ఓ అదృశ్య శక్తి వారిని కాపాడుతూ ఉంటుంది. అది వారికి నిజంగా పునర్జన్మేనని చెప్పాలి. ఇటువంటి ఘటనలు చూసినవారెవరైనా వారికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయనే చెబుతారు. సరిగ్గా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న పలాసకి చెందిన ఓ బాలుడు ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని సూసైడ్‌కి యత్నించి చివరి నిమిషంలో బతికి బట్టకట్టాడు. ఇంటి వద్ద స్కూల్‌కి వెళుతున్నానని చెప్పి గురువారం ఉదయం పలాస రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. ప్లాట్‌ఫారం నుంచి కిందకు దిగి ట్రైన్ వచ్చే ముందు ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడుకున్నాడు ఆ బాలుడు. వెంటనే అది గమనించిన GRP ఎస్సై షరీఫ్ అతని సిబ్బంది సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడారు. అయితే GRP పోలీసులను చూసిన బాలుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తప్పయిపోయిందని ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడనని బావురుమని ఏడుస్తూ SI కాలు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. తానేమి చేయనంటూ బాలుడుని సముదాయించి అక్కడ నుంచి తీసుకువెళ్లారు. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్టేషన్‌కి పిలిపించారు. అసలు విషయం తెలుసుకున్నారు. బాలుడు చదువుపై దృష్టి పెట్టడం లేదని ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని తెలుసుకుని.. సదరు బాలుడికి, అతని తల్లిదండ్రులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడిని అప్పజెప్పారు. సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడిన GRP SIని, సిబ్బంది హెచ్.సి పి కోదండరావు, నాగరాజు, ఎమ్ సంతోష్ కుమార్, దేవేంద్రలను బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. ఈ రోజుల్లో యువత ఆవేదనకు గురవుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలోచించటం లేదు. తల్లిదండ్రులు మందలించారనో,చదువులో వెనుకబడ్డారనో ,స్నేహితులు అవహేళన చేశారనో, ప్రేమలో ఫెయిల్ అయ్యారనో అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. యువతే కాదు ముక్కు పచ్చలారని మైనర్‌ల మెదడులో సైతం ఈ మధ్య ఇటువంటి ఆలోచనలే మెదలటం నేటి సమాజంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్ళ జీవితానికి ముగింపు పలుకుతుండటం కలిచి వేస్తుంది. క్షణికావేశంలో అటు వారి భవిష్యత్‌కు చేతులారా ముగింపు పలకడంతో పాటు తల్లిదండ్రులకు జీవితాంతం కడుపు కోతను మిగిలిస్తున్నారు. తీవ్ర ఆవేదనకు గురైనప్పుడు కాసేపు ఓపిక,సహనం పట్టాలని, క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై చదువు విషయంలో ఒత్తిడి తేకూడదని అంటున్నారు. కోపంలో పిల్లలను మందలిస్తే ఒకటి రెండు రోజులు వారి మానసిక పరిస్థితిని అబ్జర్వ్ చేయాలని సూచిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :