Saturday, 18 May 2024 11:19:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆ ఊర్లో ఒక్క ఫోన్ లేదు.. బస్సులేదు.. ఆస్పత్రి లేదు..108 వాహనానికి ఫోన్ చేయాలంటే 6 కి.మీ. నడవాల్సిందే

Date : 21 October 2023 08:45 AM Views : 69

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : బాహ్య ప్రపంచానికి ఆ గ్రామం చాలా దూరం. మౌలిక సదుపాయాలకు, కనీస వసతులకు కూడా అంతేదూరం. వీరి అలవాట్లే కాదు, భాషలో కూడా యాస ఉంటుంది. దేశానికి స్వాతంత్రం సిద్దించి దశాబ్దాలు గడుస్తున్నా ఈ ఊరు ప్రజలకు మాత్రం ఇంకా స్వాతంత్ర ఫలాలు అందలేదన్నది నిర్వివాదాంశం. ఇదేదో మారుమూల ఆటవిక ప్రాంతం అనుకుంటే పొరపాటే. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో… ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందామా… ప్రకాశంజిల్లా పశ్చిప్రాంతంలో ఆ గ్రామం ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. కనిగిరి నియోజకవర్గం సీఎస్ పురం మండలం తుంగూడు గ్రామ ప్రజల వారి జీవన విధానం, వారు జీవిస్తున్న ప్రాంతం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. 40 కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నా.. ఆధునిక వసతులకు, సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా జీవిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినా ఇంకా అభివృద్ధి చెందని గ్రామాలు ఉన్నాయనడానికి ఈ గ్రామాన్ని చూస్తే అర్థమవుతోంది. తుంగూడు గ్రామస్తులు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నా గిద్దలూరు నియోజకవర్గం వీరికి కూతవేటు దూరంలోనే ఉంది. బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామం వీరికి చాలా దగ్గరగా ఉంది. వీరికి ఏ అవసరం వచ్చినా మొదట కంభం, బేస్తవారిపేట ప్రాంతాలకు వెళుతుంటారు. వీరు సిఎస్ పురం గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. గతంలో వీరికి కంభం ప్రాంతం నుండి ఉదయం, సాయంత్రం ఓ ట్రిప్ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ సమయంలో ఉన్న ఈ ఒక్క బస్సు సర్వీసు కూడా నిలిపివేశారు. గతంలో ఉన్న ఆర్టీసీ బస్సు సర్వీసు ద్వారా ఈ గ్రామస్తులు వారి పిల్లల విద్య, వైద్యం వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతూ ఉండేది. ప్రస్తుతం ఆ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. 108కి ఫోన్‌ చేయాలంటూ 6 కిలో మీటర్లు నడవాలి… ఇక ఈ గ్రామస్తులకు వైద్య సహాయం అవసరమైతే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అత్యవసర సమయంలో 108 వాహనానికి ఫోన్ చేయాలన్నా 6 కిలోమీటర్లు నడిచి బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామ సమీపానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం అందించాల్సిన పరిస్థితి. ఇక సర్కారు అందిస్తున్న రేషన్ బియ్యం తీసుకోవాలన్న 6 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆ సౌకర్యం ఉన్న బేస్తవారిపేట ప్రాంతానికి వెళ్లి వేలి ముద్రలు వేసి రేషన్ పొందుతున్నారు. ఇలా ఈ గ్రామస్తులకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. ఇక ఈ గ్రామంలో ఇప్పటికీ చాలా మేరకు పూరి గుడిసెలు దర్శనమిస్తాయి. గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకునేందుకు వెసులుబాటు ఉన్నా. ఆ పై చదువులు చదవాలి అంటే వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తమ పిల్లల్ని అటు సిఎస్ పురం కానీ లేదా ఇటు బేస్తవారిపేట, కంభం కానీ పంపించవలసిందే అంటున్నారు ఆ గ్రామస్తులు. రోజూ వెళ్లి వచ్చేందుకు వాహన సదుపాయం లేకపోవడంతో వారి పిల్లల్ని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నామంటున్నారు. వీరు గిద్దలూరు నియోజక వర్గానికి 50 కిలోమీటర్లు, కనిగిరి నియోజకవర్గానికి 65 కిలోమీటర్లు దూరంలో జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం కంభం, బేస్తవారిపేట, సియస్‌ పురం ప్రాంతాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే. ఈ రెండు నియోజకవర్గాలకు చిట్ట చివర ఉండటం. అందులో చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉండటం వల్ల తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని వాపోతున్నారు… ఎవరూ పట్టించుకోక పోవడం వల్లే తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తుంగూడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కనిగిరి నియోజకవర్గం లోనే ఉన్నా మౌలిక సదుపాయాల కోసం గిద్దలూరు నియోజక వర్గం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నామని అంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో కూడా కనీస మౌలిక సదుపాయాలు పొందేందుకు నిత్యం జీవన్మరణ సమస్యగా పోరాడాటానికి వెనుక స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ఒప్పుకోవాల్సిందేమో. టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి గ్రామాలను చూసైనా ఇంకా వెనుకబడే ఉన్నామని పాలకులు ఆలోచించాలి. మౌలిక సదుపాయాలకు నోచుకోని ఇలాంటి గ్రామాలను ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిస్తాయని, అభివృద్ధి చేస్తాయని ఆశిద్దాం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :