Saturday, 18 May 2024 10:51:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Pawan Kalyan: అనుభవం, పోరాటపటిమ రెండూ అవసరమే.. పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లాజిక్‌..

Date : 05 October 2023 09:37 PM Views : 83

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొత్త లాజిక్‌ చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరం అంటూ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. Pawan Kalyan: అనుభవం, పోరాటపటిమ రెండూ అవసరమే.. పవన్‌ కల్యాణ్‌ సరికొత్త లాజిక్‌.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొత్త లాజిక్‌ చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరం అంటూ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్‌ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒక్కటే అనే జాతి భావన తక్కువని చెప్పారు. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముదినేపల్లిలో బహిరంగ సభ.. ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర బహిరంగ సభ ఇవాళ ముదినేపల్లిలో జరగనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు గురజా సెంటర్లో బహిరంగ సభకు ఏర్పాట్ల చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేనతోపాటు.. టీడీపీ నాయకులు సైతం పిలుపునిచ్చారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. అయితే, పవన్ కల్యాణ్ సాయంత్రం మచిలీపట్నం బంటుమిల్లి మీదగా ముదినేపల్లి చేరుకోనున్నారు. కాగా.. ఇప్పటికే మాటల వేడిని పెంచిన పవన్ కల్యాణ్.. ముదినేపల్లి సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ యాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తును పెంచారు. వీడియో చూడండి..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :