జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మాంసం తిని ఎముకలు మెడలో వేసుకోవడం అంటే ఇదేనేమో. ఓ వేటగాడు వన్యప్రాణిని వేటాడి.. ఆపై వేటాడిన దృశ్యాలను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాడు. ఇంకేముంది ఆ వీడియోలు చూసిన జంతు ప్రేమికులు బగ్గుమన్నారు. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఆ వేటగాని కోసం వేట ప్రారంభించారు. ఎట్టకేలకు వేటగాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. అందుకే అప్పుడెప్పుడో పెద్దలు మాంసం తిని ఎముకలు మెడలో వేసుకోవద్దని సామెత చెప్పారు. అచ్చం ఇలాంటి ఉదంతమే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వల్లంపాడు గ్రామానికి చెందిన సూర్యనారాయణకు జంతువులను వేటాడటం హాబి. ఇందులో భాగంగా గత రెండు రోజుల క్రితం వల్లంపాడు గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో ఉడుమును వేటాడు ( manitor Lizard ). అంతటితో ఊరుకోకుండా తాను ఉడుమును వేటాడే దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించారు. వన్యప్రాణి ఉడుమును తాను ఏ విధంగా వేటాడింది వీడియోలో వివరిస్తూ చిత్రీకరించారు. వాటిని తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాలను చూసిన హైదరాబాద్‌కు చెందిన స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ యూట్యూబ్ ఛానల్‌లో ఈ దృశ్యాలను చూసి, నంద్యాల జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ఛానల్ లోని దృశ్యాల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వల్లంపాడులో గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టి వేటగాడు సూర్యనారాయణ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూర్యనారాయణ ఉడుమును వేటాడిన విషయం నిర్ధారణ కావడంతో అతని పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సూర్యనారాయణ ను అరెస్టు చేశారు.
Admin