Saturday, 18 May 2024 01:11:23 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Nara Bhuvaneshwari Bus Yatra: ‘మేలుకో తెలుగోడా’.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే..!

Date : 05 October 2023 09:43 PM Views : 92

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : Nara Bhuvaneshwari Bus Yatra: నారా లోకేష్ ఢిల్లీలో ఉండటంతో.. నారా భువనేశ్వరి, నారా వారి కోడలు, బాల కృష్ణ కూతురు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. అంతేకాదు పార్టీ శ్రేణులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. అక్కడే ఉంటూ పార్టీ కేడర్‌కు మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తారనే చర్చ మొదలైంది. ఈ మేరకు పార్టీలో చర్చకు తగినట్లు రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. Nara Bhuvaneshwari Bus Yatra: 'మేలుకో తెలుగోడా'.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే..! తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నారా భువనేశ్వరి రాజమండ్రిలో నిరాహార దీక్ష చేపట్టిన విశషయం తెలిసిందే. అయితే, నిరాహార దీక్షలు కాకుండా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. ఇక తన తొలి అడుగును కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. కుప్పం నుంచి ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర చేసే ఆలోచనలో నారా భువనేశ్వరి ఉన్నట్లు సమాచారం. బస్సుయాత్ర ప్రారంభించవచ్చన్న వార్తల నేపథ్యంలో.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఆధ్వర్యంలో యాత్ర రూట్‌మ్యాప్‌ను బుధవారం పరిశీలించారు. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు టీడీపీ నేతలు. ఆ వివరాలను టీడీపీ అధిష్ఠానానికి పంపించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే, బస్సుయాత్ర తేదీ ఇంకా నిర్ణయం కాలేదు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీ, తెలంగాణ, ఢిల్లీలో దీక్షలు చేసింది తెలుగు దేశం పార్టీ శ్రేణులు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ఒక్కరోజు నిరాహర దీక్షకు పార్టీ క్యాడర్ భారీ ఎత్తున మద్దతు పలికారు. ఏపీలో పలు చోట్ల వినూత్న రితీలో పార్టీ శ్రేణులు దీక్షలు చేశారు. అయితే, ఆ తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నారా లోకేష్ ఢిల్లీలో ఉండటంతో.. నారా భువనేశ్వరి, నారా వారి కోడలు, బాల కృష్ణ కూతురు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. అంతేకాదు పార్టీ శ్రేణులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. అక్కడే ఉంటూ పార్టీ కేడర్‌కు మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా భువనేశ్వరి కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తారనే చర్చ మొదలైంది. ఈ మేరకు పార్టీలో చర్చకు తగినట్లు రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కోర్టుల్లో వచ్చే నిర్ణయాలకు అనుగూనంగా భువనేశ్వరి బస్సు యాత్రపై ఫైనల్ నిర్ణయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు నేతలు. ఇదిలావుంటే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగించాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. కేసులో మరింత లోతుగా విచారణ జరగాలంటే కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. స్కిల్‌ స్కామ్‌ మొత్తం చంద్రబాబే నడిపించారని..అందువల్ల బెయిల్ ఇవ్వకుండా కస్టడీకిఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :