Saturday, 18 May 2024 01:41:59 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బండారు క్షమాపణ చెప్పాలి.. మంత్రి రోజాకు సినీ నటి కుష్బూ బాసట..

Date : 06 October 2023 07:52 PM Views : 74

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సినీ నటి కుష్బూ తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను మంత్రి రోజాకు మద్ధతుగా పోరాటం చేస్తానని చెప్పారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. మహిళా మంత్రిపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని.. ఓ మనిషిగా కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. మహిళలను దూషించడం తన జన్మహక్కు అన్నట్లు టీడీపీ నేత వ్యవహార తీరు ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను రోజాకు సపోర్ట్‌‌గా పోరాటం చేస్తానని చెప్పారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై నగిరిపాలెం పోలీసులు కేసు నమోదుచేసి అక్టోబర్ 2న అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మంత్రి రోజా తీవ్రంగా దూషించినందునే.. తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :