Saturday, 18 May 2024 11:57:35 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎన్నికలు సమీపీస్తున్న వైసీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 26 నుంచి..

Date : 21 October 2023 08:48 AM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఎన్నిక‌ల కోసం వ‌చ్చే మూడు నెల‌ల పాటు ప్ర‌జ‌ల్లో ఉండేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..పార్టీ కేడ‌ర్ మొత్తం ప్ర‌జ‌ల్లోనే ఉండేలా ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ ను రూపొందించింది పార్టీ అధిష్టానం. విజ‌య‌వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేవంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ను కేడ‌ర్ కు వివ‌రించారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కార్య‌క్ర‌మాల‌ను ఒక్కొక్క‌టిగా ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నారు..ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వ సిబ్బందితో క‌లిసి పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు వెళ్తున్నారు.ఇక గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ది ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు బ‌స్సు యాత్ర‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది పార్టీ నాయ‌క‌త్వం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని సీఎం జ‌గ‌న్ దిశానిర్ధేశం చేశారు. ప్ర‌తి రోజూ ఉత్త‌రాంధ్ర‌,ద‌క్షిణ కోస్తా,రాయ‌ల‌సీమ… ఇలా మూడు ప్రాంతాల్లోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌స్సు యాత్ర చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు…అక్టోబ‌ర్ 26 నుంచి విడ‌త‌ల వారీగా మొత్తం మూడు ప్రాంతాల్లోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌స్సు యాత్ర చేప‌ట్టేలా పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు వ‌రుస స‌మావేశాలు పెడుతున్నారు. యాత్ర‌లు స‌క్సెస్ చేసేందుకు రంగంలోకి దిగిన రీజినల్ కోఆర్డినేట‌ర్లు సామాజిక బస్సు యాత్ర‌లు అక్టోబ‌ర్ 26 నుంచి మొద‌లు పెట్టి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ దాదాపు 60 రోజుల పైగా జ‌రిగేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.మూడు ప్రాంతాల్లో మూడు టీమ్ లు బ‌స్సు యాత్ర‌ల్లో పాల్గొంటాయి. ఒక్కో టీమ్‌లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్‌ నాయకులంతా ఉంటారు.ఎమ్మెల్యేలు లేదా స్థానిక స‌మ‌న్వ‌యక‌ర్త‌లు ఈ బ‌స్సు యాత్ర కు అధ్యక్ష‌త వ‌హిస్తారు.ఒక్కోరోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మీటింగ్‌ పెట్టి ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత, స్కూళ్లు,ఆసుప‌త్రుల్లో నాడు – నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. వ్యవసాయం గురించి,జరిగిన అభివృద్ది గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరించాల‌ని సీఎం దిశానిర్ధేశం చేశారు. సాయంత్రానికి మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్‌ మీటింగ్‌లు, బస్సు పైనుంచే బహిరంగ సభలో ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్ర‌లు విజ‌య‌వంతం చేసేందుకు రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా వారివారి జిల్లాల్లో స‌మావేశాలు ఏర్పాటుచేసి మొద‌టి విడ‌త బ‌స్సు యాత్ర‌కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా సిద్దం చేశారు. మొద‌టి విడ‌త‌లో మూడు ప్రాంతాల్లో అక్టోబ‌ర్ 26న‌ ప్రారంభ‌మ‌య్యే బస్సు యాత్ర‌లు అక్టోబ‌ర్ 29, న‌వంబ‌ర్ 5 వ తేదీ ఆదివారాలు మిన‌హా మిగిలిన 13 రోజుల పాటు అంటే న‌వంబ‌ర్ 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జ‌రిగే మీటింగ్‌ లో ఎక్కువ‌మంది పేద‌వారు పాల్గొనేలా చూడాలి…ఇది పేద‌ల‌కు-పెత్తందార్ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వార్ గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న సీఎం సూచ‌న‌ల‌తో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ యాత్ర‌లు స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి,ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి,త‌ల‌శిల ర‌ఘురాంల‌కు అప్ప‌గించింది అధిష్టానం. ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎప్పుడెప్పుడు యాత్ర జ‌ర‌గ‌నుందంటే.. అక్టోబ‌ర్ 26 – ఇచ్చాపురం – తెనాలి – శింగ‌న‌మ‌ల‌, అక్టోబ‌ర్ 27 – గ‌జ‌ప‌తిన‌గ‌రం – న‌ర‌సాపురం – తిరుప‌తి, అక్టోబ‌ర్ 28 – భీమిలి – చీరాల – ప్రొద్దుటూరు, అక్టోబ‌ర్ 30 – పాడేరు – దెందులూరు – ఉద‌య‌గిరి, అక్టోబ‌ర్ 31 – ఆముదాల‌వ‌ల‌స – నందిగామ – ఆదోని, న‌వంబ‌ర్ 1 – పార్వ‌తీపురం – కొత్త‌పేట – క‌నిగిరి, న‌వంబ‌ర్ 2 – మాడుగుల – అవ‌నిగ‌డ్డ – చిత్తూరు, న‌వంబ‌ర్ 3 – న‌ర‌స‌న్న‌పేట – కాకినాడ రూర‌ల్ – శ్రీకాళ‌హ‌స్తి, న‌వంబ‌ర్ 4 – శృంగ‌వ‌ర‌పుకోట – గుంటూరు ఈస్ట్ – ధ‌ర్మ‌వ‌రం, న‌వంబ‌ర్ 6 – గాజువాక – రాజ‌మండ్రి రూర‌ల్ – మార్కాపురం, న‌వంబ‌ర్ 7 – రాజాం – వినుకొండ – ఆళ్ల‌గ‌డ్డ‌, న‌వంబ‌ర్ 8 – సాలూరు – పాల‌కొల్లు – నెల్లూరు రూర‌ల్, న‌వంబ‌ర్ 9 – అన‌కాప‌ల్లి – పామ‌ర్రు – తంబ‌ళ్ల‌ప‌ల్లెలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :