జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నవంబర్ 25 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి అదే పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద వాయుగుండంగా బలపడుతుందంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు/ ఆగ్నేయ గాలులు వీస్తాయి. రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురువనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ————————————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:- ————————————————– ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ———————- దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————– ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ:- ——————- ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Admin