Saturday, 18 May 2024 11:19:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు.. కేసు బుక్ చేసిన పోలీసులు

Date : 13 November 2022 07:55 PM Views : 229

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు బుక్ చేశారు. తెనాలి మారీస్ పేటకు చెందిన పి. శివకుమార్ అనే వ్యక్తి ఈ నెల 5న ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బైక్పై వెళ్తుండగా.. పవన్ కళ్యాణ్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీఎస్ 07 సీజీ 2345 కారు టాప్పై కూర్చొని ఉండగా.. మరికొందరు దానికి వేళాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆ కారు వెనుక మరికొన్ని వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో ఆ వేగానికి తన బైక్ అదుపుతప్పి కిందపడిపోయానని శివకుమార్ కంప్లైంట్ చేశాడు. అజాగ్రత్తగా, అతివేగం, నిర్లక్ష్యంతో పాటు ప్రజలకు ప్రమాదం కలిగేలా కారు నడిపిన డ్రైవర్తో పాటు కారు టాప్పై కూర్చున్న పవన్ కళ్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు. శివ కుమార్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పవన్ కళ్యాణ్తో పాటు కారు డ్రైవర్పై కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 279, 336తో పాటు మోటార్ వెహికిల్ యాక్ట్ లోని 177 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :