జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / న్యూ ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో తాము గుర్తించిన అవకతవకలను చంద్రబాబు సీఈసీ రాజీవ్‌కుమార్‌కు వివరించారు. ఓటరు జాబితాల అక్రమాలపై సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు, ఒకే ఇంటి నెంబరుపై వందల సంఖ్యలో ఓట్లు, సున్నా డోర్ నెంబరు ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
Admin