జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలపై సీఐడి ముందు విచారణకు హాజరవుతున్నారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో లోకేష్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ సమయంలో కొన్ని నిబంధనలు కూడా ఫాలో కావాలని సూచించింది. రింగ్ రోడ్డు కేసులో సీఐడి ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. సీఐడీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కుంచనపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం -2 కార్యాలయానికి వెళ్లనున్నారు లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో A 14 గా ఉన్న లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్రమాలు జరిగాయంటుంది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చింది సీఐడి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు బినామీలకు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించారనేది సీఐడీ ఆరోపణ. ప్రధానంగా లింగమనేని రమేష్ ఇంటిని క్విడ్ ప్రోకో విధానంలో తీసుకున్నారని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉందని పేర్కొంది. లోకేష్ పార్టనర్ గా ఉన్న హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూరాలనే ఉద్దేశంతోనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేసారని చెబుతుంది. దీంతో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు సీఐడీ సిద్దమైంది. ముందుగానే నారా లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు లోకేష్ కు 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చి ఈనెల 4న విచారణకు రావాలని సూచించారు. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. దీంతో మరోసారి నారా లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. హెరిటేజ్ సంస్థలో లోకేష్ ఒక పార్టనర్ మాత్రమేనని. ఆ సంస్థకు సంబంధించిన కీలక వివరాలు లోకేష్ కు తెలియదంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.
Admin