Saturday, 18 May 2024 09:42:09 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అభివృద్ధిపై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి.. ఎకో సెన్సిటివ్ జోన్‌గా కొల్లేరు ప్రాంతం..!

Date : 07 November 2023 11:40 AM Views : 81

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా, వలస పక్షులతో పర్యాటకులను అలరిస్తూ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కొల్లేరు ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొల్లేరు అభయారణ్యంతో పాటు పరివాహక ప్రాంతాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల నిర్ధారణ ప్రతిపాదనలకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. సరిహద్దుల నిర్ధారణ కోసం సమగ్రమైన ప్రతిపాధనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాన్ని, నిర్థారణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, అటవీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, ట్రాన్స్కో, రెవిన్యూ, పంచాయతీ, మత్స్య శాఖ, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, భూగర్భ జలాలు, మునిసిపల్, పర్యావరణ, పరిశ్రమలు, సర్వే, స్వచ్చంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేశారు. కొల్లేరు ప్రాంతంలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం కొల్లేరు ప్లస్ కాంటూర్ కి పైన 10 కిలోమీటర్ల పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దులు నిర్దారణ చేయనున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ కొన్ని కార్యకలాపాలను నియంత్రించడం ఎకో సెన్సిటివ్ జోన్ సరిహద్దుల ప్రాథమిక లక్ష్యం. తద్వారా రక్షిత ప్రాంతాన్ని ఆవరించి ఉన్న పర్యావరణ వ్యవస్ధ కార్యకలాపాల ప్రతికూల పరిస్థితులను తగ్గించనున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణలో వన్యప్రాణుల అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించనుంది. అలాగే కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ను తయారుచేసి, సంబంధిత గ్రామాల ప్రజలకు దానివల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారు. గ్రామ సభలలో వచ్చే సూచనలు, అభ్యంతరాలను తప్పనిసరిగా నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందిస్తారు. అలాగే కొల్లేరు కాలుష్యానికి ముఖ్య కారణమైన విజయవాడ నుండి వచ్చే బుడమేరు వ్యర్ధాలు కొల్లేరులో కలవకుండా, తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :