Saturday, 18 May 2024 11:19:40 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

Date : 30 October 2023 09:02 AM Views : 69

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్‌ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగాడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా, సుమారు 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్‌ 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ప్రకటించారు. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మోడీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై సీఎం జగన్‌తో మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ మాట్లాడారు. ఘటన స్థలంలో అంబులెన్స్‌లు కాగా, రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి భారీగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతోంది. సీఎం జగన్‌ ఆదేశాలో మంత్రి బోత్స సత్యనారాయణ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు. బాధిత కుటుంబాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :