Wednesday, 15 January 2025 08:27:30 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కందుకూరు సభలో విషాదం.. 8 మంది టీడీపీ కార్యకర్తల మృతి.. మరో ఐదుగురి పరిస్థితి

మరో ఐదుగురి పరిస్థితి

Date : 29 December 2022 08:43 AM Views : 309

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో తీవ్ర విషాదం నెలకొంది. సభలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమాయకులు చనిపోవడం బాధకరమంటూ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధిలా అండగా ఉంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్లేట్ కాలువలో పడిపోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చికిత్స పొందుతు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో మరికొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాతే ప్రసంగిస్తానంటూ చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యకర్తలు చనిపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అండగా ఉంటాం.. లోకేష్ కందుకూరు చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నారా లోకేష్ ట్విట్ చేశారు. తమ కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ ట్విట్ చేశారు. కందుకూరు చంద్రబాబు గారి పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :