Thursday, 05 December 2024 06:15:00 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఇవాళ ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్ టూర్.. జోరుగా రాజధాని తరలింపు అంశం..

Date : 16 October 2023 10:03 AM Views : 157

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని, ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలోజిల్లాలో పర్యటిస్తారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు.. ఉ.10:20 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్‌ మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ సెంటర్‌ ప్రారంభం ఉ.10.50 నుంచి 11.55వరకు ఇన్ఫోసిస్‌లోనే జగన్‌ ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55వరకు అక్కడే జగన్ గడుపుతారు. తర్వాత జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను జగన్ ప్రారంభిస్తారు. ప్రత్యేక విమానంలో గన్నవరంకు.. మ.12.05కి అనకాపల్లిజిల్లా పరవాడ ఫార్మాసిటీలో.. యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభించనున్న జగన్‌ మ.1.30కి అచ్యుతాపురంలోని లారస్ ల్యాబ్ యూనిట్‌ 2 ప్రారంభం మ.3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అనంతరం హెలికాఫ్టర్‌లో 12.05 గంటలకు అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులతో మాట్లాడిన తర్వాత ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి అచ్యుతాపురంలోని ఏపీఎస్ఈజెడ్‌కు చేరుకుని లారస్ ల్యాబ్ యూనిట్‌ 2ను ప్రారంభిస్తారు. తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని.. అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :