Saturday, 18 May 2024 10:08:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వాన్ని కోరిన జనసేనాని..

Date : 16 October 2023 09:57 AM Views : 91

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదని అన్నారు. ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు విషయంలో జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని విమర్శించారు. డాక్టర్ల నివేదికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు అంబటి. చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని అన్నారు. అందుకే ఎంత మంది సీనియర్‌ న్యాయవాదులను పెట్టినా బెయిల్‌ దొరకలేదన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలే అంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అంతకు ముందు చంద్రబాబుకు చల్లటి వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు సూచించడంతో పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. చంద్రబాబుకు డేర్మటాలజీ ఉందని, స్కిన్ సమస్యలు మళ్లీ రాకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వైద్యుల సూచనలను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేస్తున్నామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. రూమ్‌లో ఏసీ ఏర్పాటుకు అనుమతి.. చంద్రబాబు తరపున వాదనలు లూథ్రా వాదనలు వినిపించగా సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు. వర్చువల్‌గా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు జైలులో చంద్రబాబు రూమ్‌లో ఏసీ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. అంతకు ముందు ములాఖాత్‌లో భాగంగా చంద్రబాబును నారా లోకేశ్‌, బ్రాహ్మణి, భువనేశ్వరి కలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి చూశాక వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని టీడీపీవర్గాలు తెలిపాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :