జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. Chandrababu Naidu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై రేపు మళ్లీ వాదనలు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను పొగించింది ఏసీబీ కోర్టు. ఈ నెల 19 వరకు పొగిస్తు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్‌గా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మరో వైపు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు కూడా గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా.. పోటాపోటీగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా.. గురువారం కూడా అదే స్థాయిలో ఇద్దరి మధ్య వాదనలు కొనసాగాయి. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్లపై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. సీఐడీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. కార్పొరేషన్ తప్పు చేస్తే చంద్రబాబుకేంటి సంబంధం అంటూ ప్రశ్నించారు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే. సాంకేతికంగా చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే బాబు పాత్ర పూర్తయిందన్నారు. బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పొరేషన్‌కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పొరేషనే, అప్పటి ప్రభుత్వం కాదన్నారు. స్కిల్ కార్పొరేషన్, సీమెన్స్, డిజైన్ టెక్‌ల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, మరోవైపు సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అదే స్థాయిలో తన వాదనలను వినిపించారు. నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారంటూ వాదించారు. చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించామన్నారు. నిధులు డీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పించాలననారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్ల సమర్పించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచామన్నారు. హవాలా నిధులు దిగమింగిన వైనంపై కోర్టుకు ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వివరణ కోరుతుందన్ని ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
Admin