Saturday, 18 May 2024 09:42:06 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

AP Inter Original Memos 2023: ఇంటర్మీడియట్‌ ఒరిజినల్‌ మెమోలు ఇంకా జారీ చేయని ఏపీ ఇంటర్‌ బోర్డు.. ఆందోళనలో విద్యార్ధులు

Date : 05 October 2023 09:50 PM Views : 75

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రతిఒక్కరినీ విస్తుగొలుపుతోంది. ఇంటర్మీడియట్‌ 2023 ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు జారీ చేయకపోవడం చర్చణీయాంశంగా మారింది. ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగియడంతో అయా విద్యాసంస్థలు ఒరిజినల్‌ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయంటూ మొరపెడుతున్నారు. చేసేదిలేక కొందరు.. AP Inter Original Memos 2023: ఇంటర్మీడియట్‌ ఒరిజినల్‌ మెమోలు ఇంకా జారీ చేయని ఏపీ ఇంటర్‌ బోర్డు.. ఆందోళనలో విద్యార్ధులు అమరావతి, అక్టోబర్‌ 5: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రతిఒక్కరినీ విస్తుగొలుపుతోంది. ఇంటర్మీడియట్‌ 2023 ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు ఒరిజినల్‌ మెమోలు జారీ చేయకపోవడం చర్చణీయాంశంగా మారింది. ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగియడంతో అయా విద్యాసంస్థలు ఒరిజినల్‌ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయంటూ మొరపెడుతున్నారు. చేసేదిలేక కొందరు విద్యార్థులు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి వచ్చి అధికారుల వద్ద త్వరలోనే మెమోలు ఇస్తామని లేఖలు తీసుకొని వెళ్తున్నారు. సాధారణంగా ప్రతి యేటా ఆగస్టులోనే ఒరిజినల్‌ మెమోలు జారీ చేస్తుంది. అయితే ఈ ఏడాది ముద్రణకు ఇచ్చేందుకే ఇంటర్మీడియట్‌ బోర్డు చాలా సమయం తీసుకుంది. మెమోల ముద్రణకు విద్యార్థుల నుంచే ఫీజుల రూపంలో డబ్బు కూడా వసూలు చేసింది. అయినప్పటికీ సకాలంలో విద్యార్థులకు మొమోలు అందించలేకపోయింది. విద్యార్థులకు మెమోలు ఇప్పించాలని, ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు సొంత రాష్ట్రానికి వచ్చి వెళ్లడం కష్టంగా మారిందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది. కేయూ పరిధిలోని డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో 2017 కంటే ముందు ఇయర్‌వైజ్‌ స్కీంలో ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబరు 9 నుంచి నవంబరు 14 వరకు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్‌ నవంబరు 15 నుంచి 21వ తేదీ వరకు, ఇంటర్న్‌ పరీక్షలు నవంబర్‌ 22, 23 తేదీల్లో జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ పి మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :