Saturday, 18 May 2024 01:59:54 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆ తర్వాతే జనసేనతో ఉమ్మడి కార్యాచరణ.. తెలుగు తమ్ముళ్ల క్లారిటీ..

Date : 11 October 2023 11:47 AM Views : 69

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. చంద్రబాబు ను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు చేశారు. పొత్తులపై పవన్ ప్రకటన తర్వాత రెండు పార్టీల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. అయితే పొత్తుల ప్రకటన చేసిన తర్వాత రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలనేదానిపై స్పష్టత ఇస్తామన్నారు జనసేనాని. అయితే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రకటన తర్వాత రెండు పార్టీలు కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇక పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరవుతారని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో సభలు సమావేశాల్లో రెండు పార్టీల నాయకులు కలిసి ముందుకు వెళ్తున్నారు అయితే భవిష్యత్తు కార్యాచరణ కు సంబంధించి రెండు పార్టీల నాయకులతో ఉమ్మడి జేఏసీ వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ వేశారు. కానీ టీడీపీ మాత్రం కమిటీ వేసేందుకు మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించింది. టీడీపీ నిర్ణయంతో ఉమ్మడి కార్యాచరణ ఆలస్యం కానుంది. చంద్రబాబు వచ్చిన తర్వాతనే కమిటీ వేయాలని టీడీపీ నిర్ణయం చంద్రబాబు నెలరోజులు కు పైగా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. ఒక వైపు క్వాష్ పిటిషన్, మరోవైపు బెయిల్ ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడక్కడా జనసేన తో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ వేసేందుకు మరికొన్ని రోజులు ఆగాలని నిర్ణయించింది. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాతనే కమిటీ వేయాలని నిర్ణయించింది. అప్పటి వరకూ ఉమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు కలిసి ఎలాంటి పిలుపు ఇవ్వకుండా స్థానికంగా ఉన్న పరిస్థితులు బట్టి ముందుకెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జేఏసీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని సూచించినా. అధినేత లేకుండా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. అందుకే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం కాస్త అలస్యమైనప్పటికీ… ఆయన వచ్చిన తర్వాతనే రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తామంతున్నారు. ఈలోగా 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ కమిటీ పార్టీ వ్యవహారాలను చూడనుంది..కానీ జనసేన తో కలిసి కార్యక్రమాలు,సీట్ల వ్యవహారం కోసం కమిటీ నియామకం,ఉమ్మడి కార్యాచరణ మాత్రం ఆలస్యం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మరిన్ని కార్యక్రమాలు జనసేన-తెలుగుదేశం కలిసి ఉమ్మడి కార్యచరణ ఆలస్యం కానుండటం తో ఈలోగా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఉదృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది.ఇప్పటికే 30 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు,నిరసనలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు…మోత మోగిద్దాం,కాంతి తో క్రాంతి వంటి నిరసన కార్యక్రమాలు తో పాటు నియోజకవర్గాల వారీగా దీక్షలు కూడా చేస్తున్నారు.రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై 14 మంది సభ్యుల టీడీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసికుంటుందని టీడీపీ నేతలు ప్రకటించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :