Saturday, 18 May 2024 11:37:56 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ రాజకీయాల్లో ‘కమీషన్‌’ రచ్చ.. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అంబటి రాంబాబు

అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అంబటి రాంబాబు

Date : 20 December 2022 02:25 PM Views : 193

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీ సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు, జనసేనకు మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. రెండు వైపులా ఆరోపణలు, కౌంటర్లు కొనసాగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌ ఆరోపణలు చేయడం, నిరూపించాలని అంబటి సవాల్‌ విసరడం, ఆ తర్వాత లబ్ధిదారులతో జనసేన నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టడం ఆసక్తిగా మారింది. రాజీనామాకు సిద్ధం అని అంబటి రాంబాబు సవాల్‌తో జనసేన నేతలు బాధితులతో ప్రెస్‌మీట్‌ పెట్టడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. దీంతో విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. జనసేనతో పాటు.. టీడీపీ అధినేత కూడా దీనిపై స్పందించడం మరింత రచ్చకు దారితీసింది. సీఎం రిలిఫ్ ఫండ్ విషయంలో.. మంత్రి రెండున్నర లక్షలు ఇవ్వాలని బాధితులు చెప్పడంతో అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. నిన్న జనసేన నేతలు.. నాలుగు నెలల కిందట సత్తెనపల్లిలో జరిగిన వినాయక రెస్టారెంట్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు. కొడుకును కోల్పోయిన కుటుంబం నుంచి మంత్రి అంబటి రాంబాబు రెండున్నర లక్షలు డిమాండ్‌ చేశారని, మరి ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. ఆ ప్రమాదంలో చనిపోయిన యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడించారు జనసేన నేతలు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఐదు లక్షల పరిహారం వస్తే రెండున్నర లక్షల్ని మంత్రి డిమాండ్‌ చేశారని ఆరోపించారు చనిపోయిన యువకుడి తల్లి మంగమ్మ. ఛైర్‌పర్సన్‌ భర్త చల్లంచర్ల సాంబశివరావు ఫోన్‌ చేసి చెప్పారని.. దీంతో వైసీపీ నేత పెండెం బాబూరావును తీసుకుని ఆయన దగ్గరకెళ్లామని చెప్పింది. రూ.5 లక్షల్లో రూ.2.50 లక్షలు ఇవ్వాలని చెప్పారని.. తన అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పినా వినలేదన్నారు. న్యాయం చేస్తారని మంత్రి అంబటి రాంబాబును కలిస్తే సాంబశివరావుకు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ వెల్లడించారని పేర్కొన్నారు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలని, బాధితులకు న్యాయం చేయాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. జనసేన ఆరోపణలకు మళ్లీ రియాక్ట్‌ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. వినాయక రెస్టారెంట్‌ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, రెస్టారెంట్‌ యజమాని కూడా చనిపోయారని చెప్పారు. న్యాయం కోసం బాధితుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తే యజమాని కుటుంబం నుంచి ఐదు లక్షల చొప్పున ఇప్పించామన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సాయం వచ్చాక వాటిని తిరిగి రెస్టారెంట్‌ యజమాని కుటుంబానికి ఇవ్వాలని ఆ రోజే చెప్పామన్నారు. ముగ్గురికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేశామని అంబటి తెలిపారు. ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేసి జనసేన చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు అంబటి రాంబాబు. ఇద్దరికి రూ.5లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిచ్చానని.. ఇందులో తాను శవాలపై పేలాలు ఏరుకోవటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. మృతుల పరిహారం తీసుకునే దౌర్భాగ్యం తనకు లేదన్నారు. జనసేన తనపై దుర్భుద్దితో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోందంటూ మండిపడ్డారు. రూ.2లక్షలు తీసుకున్నానని నిరూపిస్తే పదవిని తృణప్రాయంగా వదిలేస్తానంటూ అంబటి పేర్కొన్నారు. కాగా.. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన చంద్రబాబు.. మీరు పాలకులా అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :