Saturday, 18 May 2024 01:11:22 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి నెల రోజులు.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసు డైరీలో కీలక పరిణామాలివే..

Date : 08 October 2023 03:46 PM Views : 79

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. స్కిల్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయాలను మరింత హీటెక్కించాయి. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి ఇవాళ్టికి సరిగ్గా నెలరోజులైంది. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి.. రిమాండ్‌, పిటిషన్లు, విచారణలతో.. చంద్రబాబు ఎపిసోడ్‌ సర్వాత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. స్కిల్ స్కామ్‌ కేసు రాజకీయ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంటే.. అన్ని ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అధికార వైసీపీ కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతోంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో అప్పుడే చంద్రబాబు అరెస్ట్‌ అయి ముప్పై రోజులు గడిచిపోయింది. టీడీపీ ప్రాజెక్టుల యాత్రలో భాగంగా నంద్యాలలో బస చేసిన చంద్రబాబును సెప్టెంబర్‌ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా.. నోటీసులు ఇవ్వకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర వాగ్వాదం మధ్య చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు. అరెస్ట్‌ అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించి.. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. స్కిల్ స్కామ్‌లో కేసులో చంద్రబాబు అరెస్ట్‌, పిటిషన్లు, విచారణకు సంబంధించిన డిటెయిల్స్ ఇవే.. * చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసు డైరీ.. * సెప్టెంబర్‌ 9న అరెస్ట్‌ * సెప్టెంబర్‌ 10న రిమాండ్‌ * సెప్టెంబర్‌ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ * సెప్టెంబర్‌ 14న ఏసీబీ కోర్ట్‌లో బెయిల్ పిటిషన్ * సెప్టెంబర్‌ 15కి బెయిల్ పిటిషన్ వాయిదా * సెప్టెంబర్‌ 19న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ * సెప్టెంబర్‌ 22న రెండు రోజుల సీఐడీ కస్టడీ * సెప్టెంబర్‌ 22న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ డిస్మిస్ * సెప్టెంబర్‌ 24వరకు రిమాండ్‌ పొడిగింపు * అక్టోబర్ 5న మరోసారి రిమాండ్ పొడిగింపు * అక్టోబర్‌ 19వరకు జ్యుడీషియల్ రిమాండ్ * అక్టోబర్ 3న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై వాదనలు * అక్టోబర్‌ 9కి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా * స్కిల్ కేసుకి సంబంధించి చంద్రబాబు.. సీఐడీ వాదనలు ఇలా.. * చంద్రబాబు వాదనలు * అరెస్ట్ అక్రమం, అన్యాయం * 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు * రాజకీయ ప్రతీకారం * విచారణ ప్రక్రియ అపహస్యం * సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ నుంచి విరాళాలు రాలేదు * బెయిల్ రాకుండా ఉద్దేశపూర్వక కుట్ర * సీఐడీ వాదనలు * అన్ని ఆధారాలు ఉన్నాయి * చంద్రబాబుకు 17ఏ వర్తించదు * షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు * ఖాజానాకు భారీగా నష్టం * టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు మరింత లోతుగా విచారించాల్సిన అవసరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. రేపు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. మొత్తానికి మండే చంద్రబాబుకు అత్యంత కీలకంగా కనిపిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :