జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నత్తలు. వీటిని రకరకాలుగా వాడుతుంటారు. చైనా వంటి దేశాల్లో తింటారు.. అమెరికాలో వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నత్తలను ఏపీలో ఓ వ్యక్తి ఇష్టంగా పెంచుకుంటున్నాడు. అందులోనూ భారత్‌లో నిషేధించిన థాయ్‌లాండ్ నత్తలను తీసుకొచ్చి మరీ పెంచుతున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో వెలుగుచూసింది. నిషేధిత థాయ్‌లాండ్ నత్తలు ఉయ్యూరులోని.. కాటూరు రోడ్డు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి. థాయిలాండ్ కు చెందిన ఈ నత్తల పెంపకంపై భారత సర్కార్ ఎప్పుడో బ్యాన్ చేసింది. కాని విశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాత్రం తమ విద్యాసంస్థ ప్రాంగణంలోనే పెంచుతున్నాడు. వాటికోసం ప్రత్యేకంగా ట్యాంకులు కట్టించి పెంపకాన్ని చేపట్టాడు. ఇటీవల నత్తల పెంపకంపై విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత రెండవ కుమారుడు మాదల చంద్రశేఖర్… యూట్యూబ్ వీడియో చేసి ఆన్‌లైన్లో పోస్ట్ చేశాడు. దీనికి మంచి వ్యూస్ వచ్చాయి. కాని.. ఆ వీడియో చూసిన వారిలో బయాలజీ ఎక్స్‌పర్టులు కూడా ఉండడం.. వారు ఈ నత్తల విషయంలో అప్రమత్తంగా ఉండి సంబంధిత శాఖ అధికారులను సమాచారం ఇచ్చారు. జీవ జాతుల నియంత్రణ రక్షిత విభాగం అధికారులు విశ్వశాంతి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకులను పరిశీలించారు. నత్తలు బ్యాన్ చేయబడిన థాయిలాండ్ జాతికి చెందినవి కావడంతో.. వివరాలు నమోదు చేసుకుని పోలీసులను ఫిర్యాదుచేశారు.. ఈ నత్తలు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు అధికారులు. ఈ ట్యాంకుల నుంచి ఒక్క నత్త బయటకు వచ్చినా.. ఆ ఒక్కటి 50సెంట్ల పొలాన్ని నాశనం చేయగదని అంటున్నారు అధికారులు. అవి పెట్టే గుడ్ల వల్ల మరింతగా వ్యాప్తి చెంది.. ముప్పు ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యాసంస్థల్లో ప్రమాదకర నత్తల పెంపకంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. థాయిలాండ్ నుంచి నత్తలను తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారం రాబడుతున్నారు. థాయిలాండ్ లో కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చూపించాలని కోరగా.. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అధికారులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నత్తలు ఇండియా వరకు ఎలా వచ్చాయనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు థాయిలాండ్ నుంచి నత్తలను జలమార్గంలో తీసుకొచ్చారా..? లేక విమానంలో తరలించారా…? అసలు థాయ్‌లాండ్ నత్తలను ఇక్కడ ఎందుకు పెంచుతున్నారు. ఈ నత్తలను పెంచి.. ఇంకెక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయాలని చూస్తున్నారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఆరాతీస్తున్నారు.
Admin